మొక్కులు తీర్చుకున్న టీడీపీ నాయకులు

  • పోతురాజు స్వామిని, గంగానమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్
  • పోతురాజు స్వామి గంగానమ్మకు ప్రత్యేక పూజలు
  • ఘనంగా గంగానమ్మ సంబరాలు

చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ఆదివారం శ్రీ గంగానమ్మ – పోతురాజు స్వామి దేవాలయంలో సంబరాలు ఘనంగా జరిగాయి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి గంగానమ్మను, పోతురాజ్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ మండలి బుద్ధప్రసాదుకు రావాలని, తద్వారా ఆయన అఖండ విజయం సాధించాలని మొక్కుకున్న టీడీపీ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే బుద్ధప్రసాదును ఆహ్వానించి పూజలు జరిపించి తమ మొక్కులు తీర్చుకున్నారు.

కార్యక్రమంలో వైస్ ఎంపీపీ, టీడీపీ మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు, ఎంపీటీసీ సభ్యురాలు రాజులపాటి అంకమ్మ, మాజీ ఎంపీటీసీ దేవభక్తుని గోపాలకృష్ణయ్య, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు కైతేపల్లి శ్రీనివాసరావు, నాయకులు మండవ శ్రీనివాసరావు, తాతా సుబ్బారావు, రాజులపాటి జగదీష్, గడ్డం నాగబాబు తదితరులు పాల్గొన్నారు.