- నల్లచెర్లోపల్లి గ్రామస్థులకు పరిటాల శ్రీరామ్ హామీ
- శ్రీసీతారాముల కల్యాణమహోత్సవానికి హజరైన శ్రీరామ్
- గ్రామంలో నెలకొన్న సమస్యల్ని స్వయంగా చూసిన శ్రీరామ్
- త్వరలోనే అన్నింటికీ పరిష్కారం చూపిస్తామని హామీ
గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వానికి తొలి ప్రధాన్యత అని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ముదిగుబ్బ మండలం నల్లచెర్లోపల్లి గ్రామంలో జరిగిన శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈకార్యక్రమంలో జనసేన ఇన్ ఛార్జి చిలకం మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇద్దరు నేతలు కల్యాణ మహోత్సవాన్ని తిలకించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామస్థులకు అంతా మంచి జరగాలని.. పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీరామ్ స్థానిక టీడీపీ నేతలతో కలిసి గ్రామం మొత్తం కలియ తిరిగారు. డ్రైనేజీ సమస్య, మంచినీటి సౌకర్యం, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, విద్యుత్ పోల్స్, లో వోల్టేజ్ సమస్య వంటివి గ్రామస్థులు శ్రీరామ్ దృష్టికి తీసుకొచ్చారు.
మంత్రి సత్యకుమార్, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి.. విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సబ్ స్టేషన్ కోసం స్థల పరిశీలన కూడా చేశారు. అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామ ప్రజలు మొత్తం హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని.. కనీసం పంచాయతీలకు వచ్చే నిధులు కూడా దక్కకుండా చేశారన్నారు. కూటమి ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికతో ఉందని.. గ్రామాల్ని అభివృద్ధి బాట పట్టిస్తామని శ్రీరామ్ అన్నారు.