రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కోవర్టు
రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా బండి సంజయ్
తమ్ముడి కంపెనీతో రేవంత్ రెడ్డి ఎట్లా ఒప్పందాలు చేసుకుంటారు?
ఆరు గ్యారెంటీలపై బీజేపీ నేతలు ఎందుకు అడగడం లేదు?
సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందిచలేదు
ప్రమాదం సోషల్ మీడియా ద్వారా మా దృష్టికి వచ్చినట్లు ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు
– ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద,ముఠా గోపాల్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో షాడో ముఖ్యమంత్రులు, షాడో మంత్రులు పరిపాలన చేస్తున్నారు. కాంగ్రెస్,బీజేపీ అవగాహనతో బిఆర్ఎస్ పార్టీకి లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నాయి. సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందిచలేదు. సుంకిశాల ప్రాజెక్టు ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కేటీఆర్ కోరినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం సోషల్ మీడియా ద్వారా మా దృష్టికి వచ్చినట్లు ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు. ప్రాజెక్టులో ఏం జరుగుతుందో ప్రభుత్వం తెలుసుకోలేక పోయింది. మంత్రులు మాట్లాడుతున్న మాటలకు పొంతన లేకుండా
పోయింది.
సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదు? రైతు రుణమాఫీ డిసెంబర్ 9వ తేదీ లోపు చేస్తామని చెప్పి ఇప్పుడు అరకొరగా రుణమాఫీ చేస్తున్నారు. రైతు భరోసా ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వలేదు. ఇలాంటి సమస్యలపై మాట్లాడేందుకు బీజేపీ నేతలకు సమయం లేదు.ఆరు గ్యారెంటీలపై బీజేపీ నేతలు ఎందుకు అడగడం లేదు? నిరుద్యోగుల సమస్యలపై బిజెపి నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించరు.
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో 8 శాతం కమీషన్ తో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నోరు మెదపడం లేదు.
బిఆర్ఎస్ హయాంలో కేవలం ఆరు లక్షల ఉద్యోగాలు ఐటీ సెక్టార్ లో వచ్చాయి. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొడంగల్ లో రైతుల భూములు లాక్కుంటున్నారని ఆందోళన చేస్తున్నారు
బండి సంజయ్ రేవంత్ రెడ్డికి కోవర్టుగా పని చేస్తున్నారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కాకుండా రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై మోడీ,అమిత్ షాకు లేఖ రాస్తాము. తమ్ముడి కంపెనీతో రేవంత్ రెడ్డి ఎట్లా ఒప్పందాలు చేసుకుంటారు? బండి సంజయ్ కు రాజ్యాంగంపై అవగాహన ఉందా?
కాంగ్రెస్,బీజేపీ మైత్రి బంధం అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో బయటపడింది. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు. కాంగ్రెస్,బీజేపీ పార్టీ ఢిల్లీలో కుస్తీ గల్లీలో కుస్తీ. రేవంత్ రెడ్డి గతంలో బీజేపీలో పని చేశారు
కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెరో ఎనిమిది ఎంపీ స్థానాలు ఇస్తే తెలంగాణకు ఏం తెచ్చారు? కేటీఆర్ ను ఎందుకు అరెస్టు చేయాలో బండి సంజయ్ చెప్పాలి. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినందుకు కేటీఆర్ ను అరెస్టు చేయాలా? కేటీఆర్ ను అరెస్టు చేయాలని బండి సంజయ్ రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇస్తున్నారు.
కాంగ్రెస్,బీజేపీ కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కేసీఆర్ పెద్ద,పెద్ద నాయకులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఉన్న నాయకులు కేసీఆర్ కాలి గోటికి సరిపోరు. ఢిల్లీకి కప్పం కట్టడానికే సీఎం సమయం సరిపోతుంది. మోదీని బడే భాయ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యం లోపించింది. హైదరాబాద్ నగరానికి బ్రాండ్ ఇమేజ్ ఉంది. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఓల్డ్ సిటీలో రోజుకో మర్డర్ జరుగుతోంది. కరెంటు కోతలు విధిస్తున్నారు. దోమలతో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. కుక్క కాట్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఉందా? లేదా అనేది అర్ధం కావడం లేదు. జిహెచ్ఎంసీ నియంత్రణ కోల్పోయింది.