రాంనగర్ చౌరస్తాలో తిరంగా ర్యాలీ

– ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, మహానాడు: రాంనగర్ చౌరస్తాలో తిరంగా ర్యాలీ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవ పండుగ ప్రారంభమైంది. మూడేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం.

ఈ సందర్భంగా ప్రతి ఇంటిపై హర్ ఘర్ తిరంగా పేరుతో జాతీయపతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారతీయ జనతా యువమోర్చ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీని తిరంగా యాత్రను నిర్వహిస్తాం. 75 ఏళ్ళ స్వాతంత్య్ర పండుగ సందర్భంగా సుమారు 23 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.

రేపు వచ్చే స్వతంత్ర దినోత్సవం రోజు కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే భారత ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వలా తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు ఈ తిరంగా ర్యాలీలో పాల్గొని దేశ సమగ్రత దేశ సమైక్యత కాపాడి స్వాతంత్ర ఉత్సవాలకు సంబంధించిన చరిత్ర ప్రపంచానికి యువతరానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేటి నుంచి 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు తిరంగా యాత్ర కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా తెలుగు ప్రజలని కోరుతా ఉన్నాను దేశ స్వాతంత్ర పండుగలో భాగస్వాములు కండి ప్రతి ఒక్కరు జాతీయ పతాకాన్ని తమ ఇంటిపై ఎగరవేయాలని కోరుతున్నాను.