– రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి, మహానాడు: తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం విలేఖర్లకు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం సంఘటన ప్రదేశానికి చంద్రబాబు ఆదేశాలతో సెంట్రల్ డిజైన్ కమిషనర్ తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసి పంపించాం. డ్యాం గేటు కొట్టుకుపోయినందున ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చాం. కౌతాలం ,కోసిగి మంత్రాలయం, నందవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించాం.