– ఎన్డీఎ పక్షాల భాగస్వామ్యంతో తిరంగా యాత్ర
అమరావతి: నేటి స్వతంత్ర ఫలాలు ఆనాటి నేతల పోరాట ఫలితం ఈ చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియచేయాల్సిన ఆవశ్యకత ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. దేశమంతా విద్యార్ధులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
బిజెవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా యాత్రను ఆమె ప్రారంభించారు . ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ జాతి యావత్తు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. . పార్టీలకు అతీతంగా దేశ మంతా జాతీయ జెండాను ప్రతి ఇంటి పైన ఆవిష్కరించు కోవాలన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి, తిరంగా యాత్ర గురించి వివరించడం జరిగిందన్నారు. కూటమి పార్టీలు కూడా భాగస్వామ్యంతో నే తిరంగా యాత్ర నిర్వహిస్తున్న విషయం మీడియాకు తెలిపారు. జాతీయ జెండా చేత బూని తిరంగా యాత్రలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు.
బిజెపి ఫ్లోర్ లీడర్ పెన్మెత్స విష్ణుకుమార్ రాజు, తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమా తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో తిరంగా యాత్ర ఇంఛార్జి ముని శుభ్రహ్మణ్యం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బబ్బూరి శ్రీరాం, మాదాల రమేష్, భోగవల్లి శ్రీరధర్, కొలనపల్లి గణేష్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నరసరాజు , వివిధ విద్యాసంస్ధల విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై, మాతరం మాతర వందేమాతరం అంటూ నినాదాలతో విజయవాడ నగర వీధుల్లో హోరెత్తించారు.