బాధితులను ఆదుకోవడం అంటే వారి భూములను ఆరగించడమా జోగి ?

  • అగ్రిగోల్డ్ భూముల స్వాహా లో సొంత కుమారుడు, బాబాయి అడ్డంగా దొరికిపోయినా కక్ష సాధింపు చర్యలని బుకాయించడం జోగి రమేష్ కే చెల్లింది
  • ఈడీ అటాచ్ మెంట్ నుండి తమ కుటుంబ సభ్యులకు మినహాయింపు ఉందని జోగి భ్రమపడ్డారేమో?
  • వైసిపి నేతలు ఎన్నికల ముందు చెప్పేది ఒకటి, అధికారంలోకి వచ్చాక చేసేది మరొకటి
  • కూటమి ప్రభుత్వం లో వైసీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి
  • టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర

అగ్రి గోల్డ్ బాధితులకు అండగా ఉంటామని 2019 ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలు నమ్మించారు. అధికారం లోకి వచ్చాక అగ్రిగోల్డ్ భూములను జోగి కుటుంబ సభ్యులే స్వాహా చేశారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా తమ కుటుంబ సభ్యులకు జోగి రమేష్ దోచిపెట్టారని రవిచంద్ర ఆరోపించారు.

ఇప్పటివరకు ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ మెంట్ లో ఉన్న భూములను జోగి కుటుంబ సభ్యులు కొనుగోలు చేయడమే కాక రికార్డులను తారుమారు చేసి సర్వే నంబర్లను మార్చివేశారని ఆయన తెలిపారు.

జోగి కుటుంబ సభ్యుల అక్రమాలపై అగ్రిగోల్డ్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు ఫిర్యాదు ఆధారంగానే ఏసీబీ అధికారులు దర్యాప్తు జరిపి జోగి రాజును అదుపులోకి తీసుకున్నారని రవిచంద్ర పేర్కొన్నారు.

అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నచ్చిన భూములను ఆక్రమించుకోవడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం అని జోగి గుర్తించాలని రవిచంద్ర మండిపడ్డారు.