-ఇరిగేషన్ పనులు చేయకుండానే రూ.200 కోట్లు స్వాహా చేసిన కాకాణి అండ్ బ్యాచ్
-ఒకే పనిని ఎఫ్.డీ.ఆర్, జనరల్ ఫండ్. ఎన్ఆర్ఈజీఎస్, ఓ & ఎం కింద చేసినట్టు చూపి నిధుల స్వాహా
-ఒక్క షట్టర్లు(చెక్కలు) మార్పిడి పేరుతోనే రూ.8 కోట్ల దోపిడీ
-ఒక్క రూపాయి జీఎస్టీ కట్టకుండానే షట్టర్ల కోసం 300 టన్నుల ఇనుము కొనుగోలు చేశారంట..ఇనుము కొనిందీ లేదు..షట్టర్లు బిగించిందీ లేదు
-రైతులు సొంతంగా చేసుకున్న పనులను కూడా తాము చేసినట్లు బిల్లులు
-వెంకటాచలం మండలంలో కాకాణి అవినీతి బాగోతాన్ని ఆధారాలతో సహా మీడియా ముందు పెట్టిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
-ఇప్పటికే ఈ అక్రమాలపై సీఎం చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేసి విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు వెల్లడి
-ఇడిమేపల్లి, ఈదగాలి పరిధిలో ఇరిగేషన్ కాలువలు, చెరువులను పరిశీలించిన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
-పనులు చేసినట్టు బిల్లులు చేసుకున్న జాబితాను సోమిరెడ్డి చదువుతుంటే విని విస్తుపోయిన రైతులు
-రాజకీయాలకు అతీతంగా అందరినీ పిలుస్తాం…కాకాణి చేసినట్టు చెబుతున్న పనులను చూపించాలని సోమిరెడ్డి సవాల్
సర్వేపల్లి: వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖ అవినీతికి అడ్డాగా మార్చి నిర్వీర్యం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో చేయని పనులను చేసినట్టు చూపి వందల కోట్లు స్వాహా చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జంగాలపల్లి వద్ద చింతగుంట ట్యాంకు సప్లయి చానల్ పనులను రైతులు చందాలు వేసుకుని రూ.3.50 లక్షలతో చేసుకున్నారు.
అదే పనిని రూ.4.80 లక్షలతో లోటస్ కన్ స్ట్రక్షన్ కంపెనీ చేసినట్టు డబ్బులు డ్రా చేసుకున్నారు. ఇడిమేపల్లి చెరువులోని చేపల ద్వారా వచ్చిన ఆదాయంతో రైతులే కట్టమీద తుమ్మ చెట్లు కొట్టించుకున్నారు.కానీ చెరువు కట్ట మీద రూ.24 లక్షలతో రోడ్డు వేయించినట్టు బిల్లులు పెట్టుకున్నారు.
మొన్న డిసెంబరులో తట్టడు మట్టి ఎత్తకుండానే రూ.18.70 కోట్లకు బిల్లులు పెట్టించుకున్నారు.కాలువల్లో నిండా నీళ్లు పారే సమయంలో పనులు చేసినట్టు చూపడం దోపిడీకి పరాకాష్ట. రూ.9.78 లక్షలతో దోసాని గుంట దొరువు పనులు చేసినట్టు చూపారు. ఇప్పుడు చూస్తే ఆ కర్రతమ్మ ఎన్ని ఏళ్ల నుంచి ఉన్నాయో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈదగాలి లో కాలువకు షట్టర్లు బిగించకుండానే బిగించినట్టు బిల్లులు చేసేసుకున్నారు.ఇలా చెప్పుకుంటే పోతే వందలాది పనులు చేయకుండానే చేసినట్టు బిల్లులు…రూ.200 కోట్లకు పైగా కుంభకోణం.ఒకే పనిని ఎఫ్.డీ.ఆర్, జనరల్ ఫండ్. ఎన్ఆర్ఈజీఎస్, ఓ అండ్ ఎం చేసినట్టు చూపి బిల్లులు చేసుకోవడం ఇప్పుడే చూస్తున్నాం.
కాలువలు, చెరువులకు కొత్త షట్టర్లు బిగించకుండానే శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీ పేరుతో రూ.8 కోట్లు దోచుకున్న కాకాణి.కొత్త షట్టర్ల కోసం ఒక్క కిలో ఇనుము కొనుగోలు చేయకుండానే 300 టన్నులు కొన్నట్లు చూపారు.ఒక్క రూపాయి జీఎస్టీ కట్టలేదు.
నిబంధనల ప్రకారం కొత్త షట్టర్లు బిగిస్తే వచ్చే పాత ఇనుము వేలం వేయలేదు..7 ఆఫ్ అకౌంట్ లోనూ ఎలాంటి వివరాలు లేవు. కానీ మొత్తంగా దోపిడీ మాత్రం జరిగిపోయింది.ఆశ అనేది ఉంటుంది కానీ..అసలు పనులే చేయకుండా బిల్లులు చేసుకోవడం చరిత్రలో ఇప్పుడే చూస్తున్నాం.అన్నదాతలకు ద్రోహం చేసిన వారు మూల్యం చెల్లించుకోకతప్పదు.