పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో దస్త్రాలు దగ్ధం

– అధికారులే కాల్చేశారని ఆరోపణలు

ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో దస్త్రాలు దగ్ధమవడం కలకలం సృష్టిస్తోంది. పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయి. కార్యాలయం లోని అధికారులే కాల్చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారుల పరిహారం అక్రమాలు బయటకు వస్తాయనే ఈ పని చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి విచారణ చేస్తున్నారు.