మహిళ జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి

మహిళ కమిషన్ కు ఫిర్యాదు

నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డి పల్లికి గ్రౌండ్ రిపోర్టుకు వెళ్లిన మహిళ జర్నలిస్టులు సరిత, విజయ రెడ్డిలపై దాడి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నెరేళ్ల శారదను మహిళా జర్నలిస్టులు కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫ్యాక్షనిస్టు వాతావరణం నెలకొందని మహిళ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. రిపోర్టింగ్ కు వెళ్లిన మహిళా జర్నలిస్టులపై కొండారెడ్డి పల్లిలో కొందరు గూండాల్లాగా వ్యవహరించి దాడి చేయడమే కాకుండా, తీవ్రమైన అసభ్యకరంగా వ్యవహరించారని మహిళ కమిషన్ చైర్ పర్సన్ కు తెలిపారు. ఈ దుశ్చర్యలకు పాల్పడ్డవారి పై చర్యలు తీసుకోవాలని మహిళా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కోరారు. మహిళ కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేసిన వారిలో TUWJ రాష్ట్ర నాయకులు ఎ.రమణ కుమార్ కూడా ఉన్నారు.