అన్న క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి రాజీ పడం

అన్న క్యాంటీను పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్

పేదల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లలో వడ్డించే ఆహారపదార్థాలను వేడిగా, నాణ్యమైనవే ప్రజలకు అందిస్తామని అన్న క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి రాజీపడమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.

తూర్పు నియోజకవర్గ పరిధిలోని కనకదుర్గమ్మ వారిధి దగ్గర ఉన్న అన్న క్యాంటీన్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ శుక్రవారం సందర్శించారు.

ఈ సందర్భంగా గద్దె రామమోహన్ అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్న వారితో అక్కడి ఏర్పాట్లు, భోజన నాణ్యత గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహించే వారితో కూడా ఆయన మాట్లాడారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని చెప్పారు. ఆహార పదార్థాలు వడ్డించే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని, ఆహారాన్ని వడ్డించే వారు కూడా పరిశుభ్రత పాటించాలని చెప్పారు. వేడిగా ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే వడ్డించాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆదేశించారు. క్యాంటీన్లో ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారం టిఫిన్, భోజనం పెడుతున్నది లేనిది ఆయన అక్కడికి వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ పేదల ఆకలిని తీర్చే ప్రదేశాలుగా అన్న క్యాంటీన్లు మారాయన్నారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటు నుంచి ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, ఆహార పదార్థాలను ప్రజలకు అందించే పరిమాణం, క్యాంటీన్ల పరిసరాల నిర్వహణ ఇలా ఏ విషయంలోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజీ పడకుండా వీటిని ఏర్పాటు చేశారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 60 రోజుల వ్యవధిలోనే 100 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. పూటకు కేవలం రూ.5 లతో పేదల ఆకలిని తమ ప్రభుత్వం తీరుస్తుందని చెప్పారు. అంటే కేవలం నెలకు రూ.450లో పేదల ఆకలిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీరుస్తున్నారని అన్నారు. అన్న క్యాంటీన్ నిర్వహణలో ఏమైనా లోపాలు లేదా ఇంకా మెరుగుపర్చడానికి ఏమైనా సూచనలు సలహాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయన చెప్పారు.