రోడ్ల పనులకు ఎమ్మెల్యే కన్నా శంకుస్థాపన

సత్తెనపల్లి, మహానాడు: సత్తనపల్లి రూరల్ మండలం అబ్బూరు గ్రామంలో సీసీ రోడ్ల పనులకు శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు మన్నెం శివ నాగమల్లేశ్వరరావు, వివిధ హోదాల్లో ఉన్న నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.