– బ్రహ్మ కుమారీస్ ప్రతినిధి రామేశ్వరి
సీతమ్మ ధార: ప్రతి ఇంట్లో విధిగా ఇంకుడు గుంతలు వుండాలి అని బ్రహ్మ కుమారీస్ సంస్థ ప్రతినిధి రామేశ్వరి కోరారు. సంఘ మిత్ర సోషల్ సర్వీసెస్ (సీతమ్మ ధార) ఆధ్వర్యంలో శనివారం ఆసీల మెట్ట జీ వీ ఎం సీ గాంధీ పార్కులో ఐదు రోజుల అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
ప్రకృతి ప్రసాదించిన వర్షపు నీరు వృథాగా కాలువలు ద్వారా సముద్రంలో కలిసి పోవడం విచారకరం అన్నారు. అమెరికా వంటి దేశాల్లో ఇంకుడు గుంతలు తప్పనిసరి అన్న నిభందనలు వున్నాయని గుర్తు చేశారు. ఇంకుడు గుంతలు ద్వారా భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయి అన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అపార్ట్మెంట్లు, వ్యక్తిగత నివాసాల్లో ప్రజలంతా విధిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
సంఘమిత్ర సంస్థ అధినేత సూరిబాబు మాట్లాడుతూ, ప్రజల్లో ఇంకుడు గుంతలు పట్ల అవగాహన పెరగాలి అన్నారు. ప్రతి ఇంటి నిర్మాణంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి అని కోరారు. లేని పక్షంలో ఇంటి ప్లాన్ ఇవ్వకూడదు అని సూచించారు. గాంధీ పార్కులొ నాలుగు రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు మీద అవగాహన కల్పిస్తాం అన్నారు. ఇంకుడు గుంతలు లేని ఇల్ల మున్సిపల్ కొలాయిలు మూడు నెలలు కట్ చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో బాల వికాస్ ఫౌండేషన్ కార్యదర్శి నరవ్ ప్రకాశ రావు, సోషల్ వర్కర్ హరి, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.