దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో వర్షాలు

– ఐఎండీ హెచ్చరిక

న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజులపాటు 20 రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ నెల 28 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి.