కన్నా యోగక్షేమాలు తెలుసుకున్న స్పీకర్‌

గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణను ఆదివారం గుంటూరు లోని వారి నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి, శస్త్ర చికిత్స అనంతరం ఎలా ఉన్నారు అంటూ యోగక్షేమలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుని పుష్పగుచ్ఛం, శాలువా తో కన్నా సత్కరించారు.