ఎస్‌హెచ్‌జీ సభ్యులకు చెక్‌ల పంపిణీ

జగ్గయ్యపేట, మహానాడు: దేశంలోని అన్ని ఎస్‌హెచ్‌జీ సభ్యులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రూ. 3 కోట్లు చొప్పున అందించారు. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో రెండు మండలాలు జగ్గయ్యపేట, వత్సవాయి వారికి పది లక్షలు చొప్పున అందించారు. అందుకు సంబంధించిన చెక్ లను జగ్గయ్యపేట శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా మండల సమాఖ్య అధ్యక్షరాలు గద్దె రాజ్యలక్ష్మి(జగ్గయ్యపేట), జి. శిరీష(వత్సవాయి ) పంపిణీ అయింది.