రాత్రి వేళలో మట్టి తరలింపు!

– కడపలో ట్రాక్టర్‌ లోడు రూ. 2,000

కడప, మహానాడు: సిద్ధవటం మండలం, టక్కోలి ఎర్ర చెరువు నుంచి ప్రతినిత్యం రాత్రి వేళలో జెసిబి యంత్రంతో ట్రాక్టర్ల ద్వారా చెరువు మట్టిని మట్టి మాఫియా విచ్చలవిడిగా జిల్లా కేంద్రం కడపకు తరలిస్తోందని ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ట్రాక్టర్ విలువ 2000 రూపాయలకు విక్రయిస్తూ అక్రమ సంపాదన దందా సాగుతోందని తెలిపారు.

ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా జోరుగా రవాణా జరుగుతోందని, అధికారులు వెంటనే మట్టి తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. గ్రామ సచివాలయ వీఆర్వో చంద్ర వివరణ కోరగా ఈ విషయం మా దృష్టికి రాలేదని చుట్టుపక్కల రైతులతో గ్రామస్తులతో విచారించి చెరువులో ఉన్న మట్టి తరలిపోకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.