– ఎమ్మెల్యే చదలవాడ
నరసరావుపేట, మహానాడు: కాలువల్లో మురుగు పేరుకుపోకుండా, చెత్త ఎక్కడికక్కడే ఉండిపోకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య అధికారులు, సిబ్బంది తమ విధులను అంకితభావంతో నిర్వర్తించాలని, తద్వారా పట్టణంలో పరిశుభ్రతకు పెద్దపీట వేద్దామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం నరసరావుపేట పట్టణంలోని 6, 7 వార్డులోని కాలువల్లో పేరుకున్న చెత్తను పరిశీలించారు. అధికారులను వెంట బెట్టుకుని పరిస్థితిని సమీక్షించారు.
పట్టణంలో మొత్తాన్ని ప్రక్షాళన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అధికారులు కూడా అందుకు తగ్గట్టుగా సహకరించాలని కోరారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించం విషయంలో ఎంత వరకైనా పోరాటం చేస్తానన్నారు. నియోజకవర్గం మొత్తాన్ని ప్రక్షాళన చేసి ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తానని, పాలన అంటే ఏంటో ప్రజలకు చూపిస్తానని ఎమ్మెల్యే అన్నారు.