ఆ యువకులు మృతి!

– బాధిత కుటుంబాలను ఓదార్చిన టీడీపీ నేత లక్ష్మి

దర్శి, మహానాడు: దర్శి బ్రాంచ్ కెనాల్ లో ఈతకు వెళ్ళి గల్లంతయిన ముగ్గురు యువకులు మృతి చెందారు. యువకుల గల్లంతు సమాచారం తెలుసుకున్న అధికార యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టడంతో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసు అధికారుల సహకారంతో ఎన్డీఆర్ బృందాలు శ్రమించాయి. అయినా ఫలితం లేకపోయింది. బ్రాంచ్ కాలవలో కొట్టుకుపోయిన లోకేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, మణికంఠ రెడ్డి మృతి పట్ల దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ లక్ష్మి విచారణం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.