(ఏ. బాబు)
క్యాలిఫోర్నియా: నోబెల్ గ్రహీతలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయమా! అవును…ఈ పార్కింగ్ కి పెట్టిన బోర్డులు చూస్తే, బయటవారికి ఆశ్చర్యమేస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా, బెర్కిలే ప్రాంగణం లో రోజూ ఈ దారిలో వెళ్తూ, అక్కడ పార్క్ చేసిన కారులు చూస్తూ, అంతమంది నోబెల్ గ్రహీతలు సామాన్యులుగా ఆ ప్రాంగణం లోనే పనిచేస్తూ ఉండటం ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. ఇన్నేళ్ళలో బెర్కిలీ యూనివర్సిటీ నుండి కనీసం 55 మందైనా నోబెల్ పురస్కారాలు పొందారు. ఒక యూనివర్సిటీ అనేది డిగ్రీలను ప్రొడ్యూస్ చేసే యంత్రం లా కాకుండా… కేవలం వారి పరిధిని విద్యార్ధులకు పాఠాలు బోధించటం వరకే కాకుండా, వారి పరిశోధనలను, అధ్యయనాలను అక్కడి సైంటిస్ట్ లు ఈ ప్రపంచ పురోగతికి, సమాజ అభివృద్ధికి కూడా ఉపయోగపడేలా కృషి చేస్తుండడం హర్షించాల్సిన విషయం.