– పార్టీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్
గుంటూరు, మహానాడు: సిద్ధాంత ప్రాతిపదికన సభ్యత్వ నమోదు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అని, సామాన్య కార్యకర్తకు అత్యున్నత స్థాయి కల్పించిన ఉన్నత ఆశయాలు విలువలు కలిగిన ఏకైక పార్టీగా బీజేపీ ప్రసిద్ధి చెందిందని పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నాలుగో మండలంలోని అరండల్ పేటలోని రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ నివాస ప్రాంగణంలో సోమవారం జరిగింది. మండల అధ్యక్షుడు పెమ్మరాజు సుధాకర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా వనమా నరేంద్రకుమార్ విచ్చేసి, మాట్లాడారు.
సభ్యత్వ నమోదు జిల్లా ప్రముఖ్ పాలపాటి రవికుమార్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదును మూడు విధాలుగా చేసుకోవచ్చని మొదటి విధానం మిస్డ్ కాల్, రెండో విధానం నమో యాప్, మూడో విధానం క్యూ ఆర్ కోడ్ ల ద్వారా సభ్యత్వ నమోదు చేసుకోవాలని సూచించారు సభ్యత్వ నమోదుకు మిస్డ్ కాల్ నెంబర్ గా 8800002024 ను కేంద్ర పార్టీ కేటాయించిందని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మండల సభ్యత్వ నమోదు ప్రముఖ్ పెద్దింటి శ్రీకృష్ణ చైతన్య, సహ ప్రముఖ్ లు మందలపు సురేష్ చౌదరి, పద్మనాభుని రమాదేవి క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు.
సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పశ్చిమ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ప్రముఖ్ చెరుకూరి తిరుపతిరావు, జిల్లా ఉపాధ్యక్షురాలు బండ్లమూడి సుగుణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి మంచాల అశోక్ నాగసాయి, కార్యదర్శులు వక్కలగడ్డ తిరుమలరావు, పార్టీ సీనియర్ నాయకులు బజరంగ్ రామకృష్ణ, మాజేటి మనోహర్, కేసనపల్లి శ్రీరామ్, కేసన్ శెట్టి చంద్రశేఖర్, శేషసాయి, జితేంద్ర గుప్తా, తదితరులు పాల్గొన్నారు.