అద్దంకి నియోజకవర్గం నుండి బీజేపీలో చేరికలు

  •  చేరికలతో పార్టీ బలోపేతం
  • దగ్గుబాటి పురంధేశ్వరి

విజయవాడ, ఆగస్ట్ 28: అద్దంకి నియోజకవర్గంలో బీజేపీకి మరింత బలం చేకూర్చేలా పలువురు సర్పంచ్‌లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురంధేశ్వరి చేతుల మీదుగా ఈ చేరికలు జరిగాయి.

ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, బీజేపీ జాతీయ భావాలపై నడిచే కార్యకర్తల సమూహం అని, కాషాయ కండువా కప్పుకోవడమే కాకుండా భాధ్యతలు కూడా స్వీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీజేపీ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలతో బీజేపీ ముందుకు సాగుతోందని, భవిష్యత్తులో అద్దంకి నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జాగర్లమూడి వారి పాలెం సర్పంచ్ వెంకట రత్నంను కమలం కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికలతో బీజేపీకి స్థానిక స్థాయిలో మరింత బలం చేకూరిందని, పార్టీ సిద్ధాంతాలు మరింత వ్యాప్తి చెందుతాయని రాష్ట్ర నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.