నూజివీడు, మహానాడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత మూడు రోజులుగా విద్యార్థులు పెద్దఎత్తున అనారోగ్యానికి గురయ్యారన్న సమాచారంతో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ మేరకు బుధవారం ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల అయింది. విద్యార్థుల వార్త నన్ను ఆందోళనకు గురిచేసింది. దీనిపై తక్షణమే స్పందించి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించాను. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. ఇటువంటివి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అధికారుల పై ఉందని ఆయన పేర్కొన్నారు.