– టీడీపీ ‘దర్శి’ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు: సీజనల్ జ్వరాలపట్ల అప్రమత్తంగా ఉండి రోగులకు సంపూర్ణ వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ‘దర్శి’ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి కోరారు. ఈ మేరకు ఆమె పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. ప్రస్తుత సీజన్లో జ్వరాలతో ప్రజలు మంచాన పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో వైద్య బృందం అప్రమత్తంగా పనిచేయాలని కోరారు. ప్రజలకు కూడా ముందస్తు జాగ్రత్తలు చెప్పాలని, ప్రభుత్వ వైద్యశాలలో 24 గంటలు వైద్యం అందేలా సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అనుభవజ్ఞులు గౌరవనీయులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వైద్య ఆరోగ్యానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచనలు చేస్తున్నారన్నారు.
ఆసుపత్రిలో ప్రధానంగా మరుగుదొడ్లు, మంచినీరు, పరిసరాల పరిశుభ్రతలపై దృష్టి పెట్టాలని ఆమె వైద్యాధికారులు కోరారు. ఎంతమంది రోగులు ప్రస్తుతం ఇన్ పేషెంట్లుగా ఉన్నారు? ఓపీలు ఎన్ని వస్తున్నాయి? మందులు అందుతున్నాయా? లేదా? అందుకు సంబంధించిన వస్తువులపై డాక్టర్ లక్ష్మి ఆరా తీశారు. ప్రభుత్వపరంగా వైద్యశాలలో వస్తువుల మెరుగుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వైద్యశాలలో ఏ అవసరం వచ్చిన తనను సంప్రదించాలని సూచించారు.