ఎమ్మెల్యే గళ్ళా మాధవి సుడిగాలి పర్యటన

గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత 43వ డివిజన్ విద్యానగర్ 3/2 లో జరిగిన దేవస్థాన ప్రతిష్ఠలో పాల్గొన్నారు. అనంతరం 34వ డివిజన్ దేవాపురంలోని పోలేరమ్మ దేవస్థానం లో కొలుపులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ వద్ద శ్రీ భగవాన్ ధన్వంతరి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. 29వ డివిజన్ శ్మశాన వాటిక వద్ద రుద్ర చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భగా గళ్ళా మాధవి మాట్లాడుతూ…. మానవ సేవే మాధవ సేవగా భావించి, నిస్వార్థంగా సేవలు అందిస్తున్న రుద్ర చారీటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు అభినందీయులన్నారు.

త్వరలో అభివృద్ధి పనులకు శ్రీకారం
కొరిటెపాడు ట్యాంక్ బండ్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి గళ్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ… నూతనంగా ఎన్నికైన కమిటీ వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలి కోరారు. గుంటూరు పశ్చిమ నియోజక వర్గ లో అతి పెద్ద ట్రాక్ ఇదే అని పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు త్వరలో మొదలు పెట్టే విధంగా మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడుతానన్నారు.