సంస్కారహీనుడికి టీటీడీ పాలకమండలి బోర్డులో పదవా? సిగ్గు సిగ్గు!

(సువేరా)

జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తుంటే ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) వాళ్లకు ఆంధ్రులంటే కనీసం మనుషులుగా కనబడడంలేదా? అనే సందేహం వస్తోంది.

ఆ ఆరెస్సెస్ చూపించిన బాటలోనే బీజేపీ నడుస్తుంది అనేది జగమెరిగిన సత్యం కదా!

ఎవరైనా ఒక యజమాని గనక తన ఇంట్లో గజ్జికుక్కనో, పిచ్చికుక్కనో పెంచుకుంటే బయటవాళ్లకు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు, కానీ ఆ యజమాని ఆ పిచ్చికుక్కను.. గజ్జికుక్కను ఊళ్ళోవాళ్ళు అందరూ తనని గౌరవించినట్లే, నా కుక్కను కూడా గౌరవించాలని రోడ్డు మీదకు వదిలితే మాత్రం జనం ఆ యజమానిమీద తిరగబడతారు.

అసలు విషయానికివస్తే, రాబోయేరోజులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ బోర్డుని నియామకం చేయబోతోంది కదా! ఆ బోర్డులో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనే ఒక అసాంఘిక కుసంస్కార వ్యక్తి పేరును ఆరెస్సెస్ సిఫార్సు చేస్తూ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ పంపినట్లు ఒక విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఇతను గతంలో అమరావతి విషయంలో, అమరావతి రైతుల ఇళ్లల్లోని మహిళల విషయంలో చాలా కారుకూతలు కూచిన సంగతి ప్రపంచానికి మొత్తానికి తెలుసు.

ఆ సమయంలో ఇతను కేంద్రంలోని కొందరు బీజేపీ పెద్దల అండదండలు చూచుకుని ఇష్టానుసారం రెచ్చిపోతూ మాట్లాడుతుంటే, ఒక టీవీ ఛానెల్ డిబేట్ లో చెప్పుదెబ్బలు తిన్న సంగతి కూడా ప్రపంచం మొత్తం చూచింది. ఇతను ట్విట్టర్లో ఉద్దేశపూర్వకంగానే, అప్పటి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ మద్దతు చూచుకుని, వైఎస్ జగన్ ప్రాపకం పొందడంకోసం.. అతనిలో ఒక కులంపట్ల ఉన్న ద్వేషాన్ని వెళ్లగక్కుతూ “కమ్మ లంజలు” అని ట్విట్టర్లో కమ్మకులానికి చెందిన ఆడవాళ్లను కించపరుస్తూ సంస్కారహీనంగా అవాకులుచవాకులూ పేలాడు, ఇది కూడా అందరికీ తెలిసిందే.!

ఇతను గతంలో అనంతపురం జిల్లాలో వామపక్షపార్టీలో విద్యార్ధినాయకుడుగా ఉంటూ ఏమేమిచేసాడో, తరువాత అక్కడ ఇతను చేసిన నేరాలపై ఎన్నెన్ని కేసులు ఉన్నాయో ఆ జిల్లాలో ఇతని చరిత్ర మొత్తాన్ని ఎవరిని అడిగినా చెబుతారు, ఆ జిల్లాలో మహిళలపట్ల ఇతను ఎలా ప్రవర్తించాడో కూడా అందరూ చెబుతారు.

అలాంటి చిల్లరగాడిని నేరస్తుడిని, హైందవ మతంలోని స్త్రీలను హేళనచేసే ఇలాంటి కులకుష్టు రోగిని, ఇలాంటి అప్రాచ్యపు వెధవను, ఇలాంటి కుసంస్కారపు బుద్ధిహీనుడిని.. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన కలియుగదైవమైన శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం పాలకమండలి సభ్యుడిగా నియమించాలని ఆరెస్సెస్ సిఫార్సు చేయడం సిగ్గుచేటు.

మరి ఈపరిస్థితులలో ఈ విషయంలో తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , జనసేన పార్టీ అధినేత ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

వీలైనంతమేరకు నూటికి తొంభైతొమ్మిది శాతం ఇలాంటి తప్పుడు సిఫార్సులను ఆమోదం జరగడానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు- పవన్ కళ్యాణ్ – లోకేష్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోరు, ఆమోదించరు. ఒకవేళ గనక .. కూటమిధర్మం- సింగినాదం జీలకర్ర అంటూ ఆరెస్సెస్ సిఫార్సుచేసే ఇలాంటి వ్యక్తులకు, మరీ ముఖ్యంగా సోమూ వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి విషపురుగులకు ఏవైనా పదవులు ఇస్తే మాత్రం.. రాష్ట్రంలో ప్రజలు మొఖాన ఉమ్మేస్తారు.

కార్యకర్తలలో తిరుగుబాటు వస్తుంది, ప్రభుత్వం నవ్వులపాలు అవుతుంది అని గమనించాల్సినవాళ్లు గమనిస్తే మంచిది. మరీ ముఖ్యంగా ఆరెస్సెస్ ఆంధ్రప్రదేశ్ లో కనీసం కొద్దిపాటి సంస్కారాన్నైనా ప్రదర్శిస్తే, వాళ్లకు సమాజంలో గౌరవమూ విలువ ఉంటాయి.

దేశంలో సనాతన ధర్మాన్ని హిందూమతాన్ని రక్షిస్తామంటూ ఉద్భవించిన ఆరెస్సెస్ గనక బరితెగించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ప్రాణాలకు ప్రాణమైన అత్యంత ప్రాచుర్యము ప్రాముఖ్యత పవిత్రమైన హిందూదేవాలయాలలో ఇలాంటి పిచ్చివేషాలకు అసాంఘిక చర్యలకు పూనుకుంటుంటే మాత్రం.. వాళ్లను అనునిత్యం సోషల్ మీడియా ద్వారా బజారుకి ఈడ్చడం ఖాయం.

నిర్ణయించుకోవాల్సింది ఆరెస్సెస్ బీజేపీలే.!

– శుభం భూయాత్