– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
విజయవాడ, మహానాడు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మహిళలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సభ్యత్వ నమోదులో మహిళా మోర్చా కీలక పాత్ర పోషించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. పార్టీ మహిళా మొర్చా ఆంధ్రప్రదేశ్ సభ్యత్వ నమోదుపై వర్క్ షాప్ బుధవారం విజయవాడ స్టేట్ ఆఫీస్ లో ఉదయం 10గంటలకు జరిగింది.
ముఖ్య అతిథిగా పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళా మొర్చా స్టేట్ అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ సమావేశానికి అధ్యక్షత వహించారు. నేషనల్ సోషల్ మీడియా ఇన్చార్జి, ఆంధ్రప్రదేశ్ సభ్యత్వ నమోదు ప్రభారీ సుజాత పాడే పాల్గొని సభ్యత్వ నమోదు గురించి వివిధ అంశాలపై దిశా నిర్దేశం చేయటంతో పాటు ఆంధ్ర రాష్ట్రం లో అత్యధిక సభ్యత్వాన్ని ఎలా నమోదు చేయాలని అనే విషయాలనుపై చర్చించారు. అలాగే జిల్లా, మండల స్థాయి సమావేశాలు కూడా నిర్వహించుకోవాలని సూచించారు. సమావేశంలో మహిళా మొర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాస్థాయి, మండల స్థాయి సభ్యులు పెద్దఎత్తున పాల్గొని తమ తమ జిల్లాల్లో, మండలాల్లో అత్యధికంగా సభ్యత్వ నమోదు, కార్యాచరణ దిశగా సమావేశం విజయవంతమైంది.