వన మహోత్సవాన్ని విజయవంతం చేస్తాం…

– ఎమ్మెల్యే చదలవాడ

నరసరావుపేట, మహానాడు: నరసరావుపేటలో ఈ నెల 30 వ తేదీన నిర్వహించ తలపెట్టిన వన మహోత్సవాన్ని విజయవంతం చేసి చూపిస్తామని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు జేఎన్టీయూ వద్ద ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పర్యటనను దిగ్విజయం చేస్తామన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం కర్తవ్యంగా భావించినపుడే మానవాళికి మనుగడ సాధ్యమవుతుందని, ఆ మేరకు ప్రజలంతా పని చేయాలని కోరారు. గత ప్రభుత్వం పర్యావరణాన్ని నాశనం చేసిందని, కానీ కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ఎంతగా ప్రాధాన్యమిస్తుందో ఈ కార్యక్రమమే నిదర్శనం అన్నారు.

గత పాలకులు పర్యావరణాన్ని నాశనం చేస్తే.. కూటమి అధికారంలోకి రాగానే పర్యావరణ పరిరక్షణ, ఆవశ్యకత గురించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అరవింద బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లపాటి రాము, వేల్పుల సింహాద్రి యాదవ్, కడియాల రమేష్, బండారుపల్లి విశ్వేశ్వరరావు, కూటమి నాయకులు రంగిశెట్టి రామకృష్ణ, బెల్లంకొండ అనిల్, అధికారులు పాల్గొన్నారు.