– టీడీపీ ‘దర్శి’ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు: సామాజిక స్ఫూర్తితో పరిపాలిస్తున్న ప్రజా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. సోమవారం జరిగిన ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో ఆమె పాల్గొని, మాట్లాడారు. పవన్ స్ఫూర్తితో రాజకీయాలలో అనేకమంది కొత్త వారు అడుగుపెట్టారని అన్నారు. రాజకీయాల్లో సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టి, తనదైన ముద్ర వేయించుకున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు. స్థానిక సంస్థల బలోపేతం, గ్రామాల అభివృద్ధి, మహిళల సాధికారిక కోసం గ్రామ సభల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రజా నాయకుడని తెలిపారు. ఇదిలావుండగా, హెచ్ ఆర్ సి ఓ అనే హైదరాబాద్ వారి సహకారంతో నియోజకవర్గంలో నిరుద్యోగులను గుర్తించి వివిధ రంగాలలో వారికి ఉన్న నైపుణ్యాల ఆధారంగా ఉపాధి కల్పించేందుకు గొట్టిపాటి లక్ష్మి రూపకల్పన చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఇది ఒక తొలి అడుగుగా లక్ష్మి తెలిపారు.