ఆహార పొట్లాలు పంపిణీ చేసిన మంత్రి సవిత

విజయవాడ, మహానాడు: విజయవాడ 55 డివిజన్ లో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మంగళవారం పర్యటించారు. ఇంటింటికీ వెళ్ళి ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. వరద బాధితులను చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వరద తగ్గే వరకు సమీప పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలని మంత్రి కోరారు.