షోరూంలో నీట మునిగిన కార్లు

విజయవాడ: విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు కార్ల షోరూం నిర్వహకులు భారీగా నష్టపోయారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న దాదాపు 300 కొత్త, పాత కార్లు నీటితో నిండిపోయాయి. రూరల్ మండలం ముస్తాబాద్ గ్రామంలో కార్ల షోరూం బుడమేరు వరద ముంపుకి గురైంది.దీంతో అందులోని కార్లన్నీ నీటిలో మునిగి కనిపిస్తున్నాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. షోరూం వద్ద ఉన్న పార్కింగ్ గౌడౌన్లో పార్క్ చేసిన చిన్న కార్ల నుంచి లగ్జరీ మోడళ్ల వరకూ మునకలో ఉండటంతో నష్టం వాటిల్లిందని షోరూం నిర్వాహకులు తెలిపారు.