సీఎం సహాయనిధికి ఐఏఎస్ అధికారుల భార్యల సంఘం 5 లక్షల విరాళం

విజయవాడ: రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం ఐఏఎస్ అధికారుల భార్యల సంఘం ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయల చెక్కును విజయవాడ కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షురాలు సిఎస్ సతీమణి రేష్మ ప్రసాద్ తోపాటు పద్మ వల్లి,ప్రదా భాస్కర్ తదితరులు సియం ను కలిసి చెక్కును అందజేశారు.