-చురుగ్గా సుజనా ఫౌండేషన్ సిబ్బంది
విజయవాడ: పశ్చిమ నియోజకవర్గం లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే సుజనా చౌదరి మొదటి రోజు నుంచి అప్రమత్తంగా వ్యవహరిస్తూ వరద సహాయ కార్యక్రమాలను స్వయంగా సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ బాధితులకు శరవేగంగా సాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు.
క్విక్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటుచేసి సోషల్ మీడియా ద్వారా , బాధితులనుంచి వినతులను స్వీకరిస్తూ ముంపు ప్రాంతాల్లో వేగంగా సాయం అందిస్తున్నారు. సుజనా ఫౌండేషన్ సభ్యులు, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది కూటమి నాయకులు వరద బాధితులకు సహాయ, పునరావాస చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఆరవ రోజు అయిన గురువారం కూడా చిట్టినగర్ లోని విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో భోజనాలను ఏర్పాటు చేసి బాధితులు వద్దకే వెళ్లి ఆహారం, పాలు, వాటర్ బాటిళ్లను అందిస్తూ సహాయక కార్యక్రమాలు వేగవంతం చేశారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాలుగు వేల పాల ప్యాకెట్లను పంపిణీ చేశారు.