– సీఎంకు చెక్కును అందజేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని
విజయవాడ, మహానాడు: వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న బాధితుల సహాయార్థం పెమ్మసాని ఫౌండేషన్ ముందుకు వచ్చింది. పెమ్మసాని ఫౌండేషన్ తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రూ. కోటి చెక్కును గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అందజేశారు.
విజయవాడ కలెక్టరేట్ లో రివ్యూ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కింద కేంద్ర సహాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడికి ఆ చెక్కును పెమ్మసాని అందజేశారు.