ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1,50,000 విరాళం ఇచ్చిన సర్వోదయ ట్రస్టు

విపత్కర పరిస్థితుల్లో పరిపాలన యంత్రాంగం పనితీరును అభినందించిన ట్రస్టు

అమరావతి: కృష్ణా జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం విజయవాడ ఆధ్వర్వంలో గాంధీ విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన సర్వోదయ ట్రస్ట్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1,50,000 విరాళం అందించింది. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి సంబంధిత చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సర్వోదయ ట్రస్ట్ ప్రెసిడెంట్ డా.జివి మోహన్ రావు మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాలైన వైఎస్సార్ కాలనీ, అజిత్ సింగ్ నగర్ వంటి ప్రాంతాల్లో స్వాతంత్ర్య సమయోధుల సంఘం తరపున ఏర్పాటైన ట్రస్టు సభ్యులు బాధిత ప్రజలకు ఆహార పొట్లాలు అందించారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా మంత్రులు, అధికార బృందం రాష్ట్రానికి వరం అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారందరూ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. తమ వంతు సాయంగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సాయం చేయడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈకార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి యం.వెంకటేశ్వర రావు,యం.జయకర్ తదితరులు పాల్గొన్నారు.