మట్టి గణపతి పూజ ప్రోత్సహించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు

పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలుగు రాష్ట్ర ప్రజలకు పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి పూజను ప్రోత్సహిస్తూ, ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “మట్టిలో పరమాత్మను దర్శించే అద్భుతమైన తత్వదర్శనం, యోగదర్శనం పార్థివ గణపతి పూజలో ఉన్నది గనుక . వినాయక చవితికి గణపతిని మట్టితో తయారు చేయాలని పురాణాది శాస్త్రాలు సూచిస్తున్నాయి.”

అలాగే, ప్రజలకు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. “కావున, ఈ వినాయక చవితికి మట్టి గణపతిని మాత్రమే పూజిద్దాం,” అని రాష్ట్ర ప్రజలను పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.