హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంచి మిత్రుడిని, సన్నిహితుడిని కోల్పోయానని ఆవేదన చెందారు.
యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జిట్టా అని సీఎం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి మరణ వార్త తనను ద్రిగ్బంతికి గురిచేసిందని బిఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ , వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జిట్టా బాలకృష్ణారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించి మొదటి నుంచి కేసీఆర్ వెంటానడిచిన వ్యక్తుల్లో జిట్టా ఒకరని కేటీఆర్ చెప్పారు. చిన్న వయసులో ఆయన లోకాన్ని వీడటం బాధిస్తోందన్నారు.

హరీష్ రావు సంతాపం
తెలంగాణ మలిదశ ఉద్యమ సహచరుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి గారి మరణం నన్ను కలచివేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అనేక పోరాటాల్లో కలిసి పనిచేశాం. భువనగిరి ప్రాంత ప్రజల కోసం జిట్టా ఎంతో తపనపడ్డారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలో యువజన సంఘాల సమాఖ్యను ఏర్పాటు చేసి యువతను ఏకం చేసే ప్రయత్నం చేసారు. బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం పటిష్టానికి కృషి చేశారు.

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
కేసీఆర్ పిలుపు మేరకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన సహచర ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి అకాల మరణం నన్ను వ్యక్తి గతంగా కలిచివేసింది. 52 ఏళ్ల వయసులో అనారోగ్యం బారిన పడిన జిట్టా త్వరలోనే కోలుకొని మళ్ళీ మనందరి మధ్యలోకి వస్తారని ఆశించాం. కానీ దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూనే ఆయన మరణించారని తెలిసిన వార్త గుండెకు భారాన్ని కలిగించింది.