హైదరాబాద్, మహానాడు: రాష్ట్రంలో వరద సహాయం కోసం రెండు నెలల జీతాన్ని కాంగ్రెస్ శాసనసభ పక్షం విరాళంగా ప్రకటించింది. ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, కార్పొరేషన్ చైర్మన్‌లు, ప్రభుత్వ సలహాదారుల రెండు నెలల జీతం ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి, కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సూచన మేరకు ఈ సహాయాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.