వరద బాధితులకు భారీ విరాళం!

– టీడీపీ ‘దర్శి’ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మిని ప్రశంసించిన సీఎం చంద్రబాబు

విజయవాడ, మహానాడు: దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సారథ్యంలో దర్శి నియోజకవర్గం నుండి వరద బాధితులకు సేకరించిన విరాళాలను ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేశారు. దర్శి టౌన్, 5 మండలాలలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర వ్యాపార వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అందజేసిన విరాళాల మొత్తం 37,16,200 రూపాయలు, అదేవిధంగా లక్ష్మి సొంతంగా ఇచ్చిన 10 లక్షలు.. మొత్తం రూ. 47,16200 చెక్కును మండల, టౌన్ పార్టీ నాయకులతో కలిసి లక్ష్మి బుధవారం రాత్రి సీఎంకు అందజేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ల కృషిని అభినందించారు. నాయకులందరినీ కలుపుకొని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో మీరు చేసిన ఈ ప్రయత్నం అభినందనీయమన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్‌ లక్ష్మి నాయకత్వంలో మీరంతా కలిసి వచ్చి ఈ భారీ విరాళాన్ని అందజేయడం ప్రశంశనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, తాళ్లూరు మండల అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, కురిచేడు మండల అధ్యక్షుడు నెమలయ్య, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షుడు యాదగిరి వాసు, ముండ్లమూరు మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, దొనకొండ మండల అధ్యక్షుడు, నాగులపాటి శివ కోటేశ్వరరావు, టీడీపీ మండల కన్వీనర్ అంజి, పార్టీ నాయకులు కలవకొలను చంద్రశేఖర్, జూపల్లి కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.