ఓటుకు నోటు కేసు!

– నిందితులు హాజరుకాకపోవడంపై కోర్టు ఆగ్రహం

నాంపల్లి, మహానాడు: ఓటుకు నోటు కేసు నాంపల్లి కోర్టులో మంగళవారం విచారణకు వచ్చింది. అయితే, ఈ కేసుకు సంబంధించిన నిందితులు హాజరుకాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఉదయ్ సింహ, సండ్ర వెంకట వీరయ్య‌, సెబాస్టియన్ తరపున ప్రతిసారీ కేవలం న్యాయవాదులు మాత్రమే హాజరవుతున్నారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ట్రయల్ ప్రారంభించడానికి నిందితులు ప్రత్యక్షంగా రావాల్సి ఉండగా కేవలం జెరుషలేము మత్తయ్య, మత్తయ్య అడ్వకేట్ కొప్పనేని సాయి మోహన్ కృష్ణలు మాత్రమే హాజరయ్యారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి న్యాయవాదులను జడ్జి తీవ్రంగా మందలించి, తదుపరి వాయిదా వచ్చే నెల 16వతేదీ ఉంటుందని.. రేవంత్ రెడ్డి, ఇతర నిందితులు అందరినీ ప్రత్యేకంగా హాజరుపరిచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాని పక్షంలో వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు వివరాలను జెరుషలేము మత్తయ్య విలేకరులకు తెలిపారు.