వైద్యులు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవ్వాలి

– బ్లడ్ షుగర్స్ పై అప్రమత్తత అవసరం
– రోగులకు నేరుగా సేవ చేయడమంటే ఇష్టం
– మణిపాల్ హాస్పిటల్స్ ఆత్మీయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని

విజయవాడ, మహానాడు: వైద్యులు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతూ ఉండాలి. బ్లడ్ షుగర్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తుండాలి. వ్యాధులు ఒకదానికి మరొకటి అనుసంధానమై ఉంటాయి. వీటిని ఎదుర్కోవడంలో వైద్యులు ముందుండాలని రూరల్ డెవలప్ మెంట్, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో మణిపాల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వైద్యుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పెమ్మసాని మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో బ్లడ్ షుగర్స్ పెరిగిపోయాయని, ఈ వ్యాధి రాక ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు చేస్తున్న సేవలు అభినందనీయమని పెమ్మసాని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశానికి తనను ఆహ్వానించిన మణిపాల్ ఆస్పత్రి యాజమాన్యానికి ఈ సందర్భంగా పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మణిపాల్ యాజమాన్యం, వైద్యులు పాల్గొన్నారు.