వైద్యం కోసం రూ. 6 లక్షలు మంజూరు

– లబ్ధిదారుకి పంపిణీ చేసిన మంత్రి మనోహర్‌

తెనాలి, మహానాడు: మండలంలోని చావావారి పాలెం గ్రామానికి చెందిన బొడ్డు కిరణ్ బాబు ఎంతో కాలంగా అరుదైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధికి శస్త్ర చికిత్స హైదరాబాద్ లో కూడా అందుబాటులో లేని క్రమంలో బెంగుళూరులో వెళ్ళాల్సి ఉంది. ఆ కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేశారు. ఆ నిధి నుంచి ఆరు లక్షల రూపాయలు మంజూరు అయింది. చెక్కుకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ కుటుంబానికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటువంటి క్లిష్ట మైన వైద్యసేవల కోసం ఇబ్బంది పడుతున్న వారు తమ దృష్టికి తీసుకురావాలని, ఆర్థిక సహకారం అందించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.