ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలి

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు: ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే అధ్యక్షతన, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కూటమి నేతలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటరుగా ఎలా నమోదు చేయాలన్న దాని పై పార్టీ శ్రేణులకు దిశానిర్దశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే మరలా ఎమ్మెల్సీ ఎన్నికలను ఎదురుకాబోతున్నాయన్నారు.

ఒక నియంతపై ఎన్ని ఒడిదుడుకులను ఎదురుకొని గెలిచామో, అదే స్ఫూర్తిగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను గెలవాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ గా నమోదు కు కేవలం ఒక నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది.. డివిజన్ల వారీగా ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రతి డివిజన్ ఎన్డీయే కూటమి అధ్యక్షుడు దీనిని బాధ్యతగా తీసుకోని, అత్యధికంగా ఓటర్లను చేర్పించాలి… ఈ ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 17 నియోజకవర్గాల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే అత్యధిక పట్టభద్రులు ఉన్న ఏకైక నియోజకవర్గం. ఈ దృష్ట్యా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఎమ్మెల్సీ ఓటర్ నమోదుపై ఎటువంటి సందేహాలు ఉన్న, నమోదు చేసుకోవాలన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సంప్రదించమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు.