‘ప‌డ‌వ‌లు, ల‌డ్డూ, న‌టి’.. కాదేదీ రాజ‌కీయానికి అతీతం:

– ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా అంబ‌టి రాంబాబు సెటైరిక‌ల్ ట్వీట్

విజయవాడ: రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘కాదేది రాజకీయానికి అతీతం’ అంటూ సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు.

“వరదలో పడవలు, ల‌డ్డూ ప్ర‌సాదం, ముంబ‌యి న‌టి.. కాదేది రాజకీయానికి అతీతం!” అని అంబ‌టి ట్వీట్ చేశారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా పోటెత్తిన వ‌ర‌ద‌ల్లో ప్ర‌కాశం బ్యారేజీ వ‌ద్ద‌కు కొట్టుకువ‌చ్చిన ప‌డ‌వ‌లు, తిరుమ‌ల శ్రీవారి ప్ర‌సాదం ల‌డ్డూ కల్తీ వ్య‌వ‌హారం, ముంబ‌యి న‌టి కాదంబ‌రీ అంశాన్ని ఆయ‌న ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. వీటితో కూట‌మి నేత‌లు రాజకీయాలు చేస్తున్నార‌ని సెటైర్లు వేశారు.