క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా

సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి రూరల్ మండలం, పెద మక్కెన గ్రామంలో స్కూల్ గేమ్స్ అండర్ 19 సెపక్‌ తక్రా పోటీలు జ్యోతి ప్రజ్వలన చేసి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పింఛన్ల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మంగళవారం ఉదయం సత్తెనపల్లి రూరల్ మండలం పెదమక్కెన గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పంపిణీ చేశారు. అలాగే గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.