అవ్వతాతలకు పెద్దకొడుకుగా చంద్రన్న

-రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్

విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే 1వ తారీఖున ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ జరుగుతుంది. చంద్రన్నే మా పెద్ద కొడుకు అంటూ అవ్వాతాతలు ఆనంద సాగరంలో తెలియాడుతున్నారు. అదే విధంగా రేషన్ సరుకుల్లో గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ దుకాణల్లో కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేసేవారు.

అది కూడా రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకున్నారు. కానీ నేడు రేషన్ దుకాణల్లో బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, నూనె మొదలైనవి అందజేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు పేదల కడుపు నింపితే.. జగన్ పెద్దల కడుపు నింపారు.

అవినీతి బంకతో అంటుకుపోయిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వద్ద నుంచి ప్రజలను కాపాడేందుకు వస్తున్నా మీకోసం అంటూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర మొదలుపెట్టారు. ‘వస్తున్న మీకోసం’ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభమై 208 రోజుల పాటు 1,253 గ్రామాలు, 162 మండలాలను కలుపుకొని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగింది.

63 ఏళ్ల వయ్యస్సులో చంద్రబాబు మొత్తం 2,817 కి.మీ నడిచి సరికొత్త చరిత్రను లిఖించారు. ఎన్ని కష్టాలు వచ్చినా విరమించకుండా ముందుకుసాగారు. ప్రజల కష్టాలు తెలుసుకుని చలించిపోయారు. రైతుల బాధలు తెలుసుకుని వారికి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటానని ధైర్యం కల్పించారు. ఎండలను, జోరు వర్షాలను సైతం లెక్క చేయకుండా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు.

చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. పాదయాత్రలో పేదల రెక్కల డొక్కల కష్టం తెలుసుకున్న చంద్రబాబు వారి కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లను సైతం ప్రారంభించారు. చంద్రన్న దార్శనికతతో రాష్ట్రం మరింత ముందుకు సాగుతుంది. గాడితప్పిన రాష్ట్రాన్ని తిరిగిలో గాడిలో పెడుతున్నారు.