వరద బాధితులకు దాతల ఆపన్న హస్తం

అమరావతి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్దఎత్తున స్పందిస్తూనే ఉన్నారు. అనంతపురం ఎంఎల్ఏ దగ్గుబాటి ప్రసాద్, ఆయన అనుచరులు రూ.11,28,100 ల చెక్కును మంత్రి లోకేష్ కు అందించారు. అదేవిధంగా మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రూ. 50,116, మంగళగిరికి చెందిన ప్రముఖులు అందే హరికుమారి రూ. 2లక్షలు, దామర్ల రామారావు రూ.1,01,116 అందజేశారు. దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.