గుడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌… ‘Tomorrow Will Not Take Care of Itself’

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్, మహానాడు: పర్యావరణ పరిరక్షణ గొప్పతనాన్ని చాటుతూ, సామాజిక స్పృహతో కూడిన ‘Tomorrow Will Not Take Care of Itself’ అనే సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ ను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఏమన్నారంటే… తెలుగు సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖ డైరెక్టర్ కోన వెంకట్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. మంచి సినిమాలతో ప్రజల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి. అదుర్స్, దూకుడు, ఢీ, వెంకీ వంటి అనేక హిట్ సినిమాలకు వారు పని చేసి… ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. పర్యావరణ పరిరక్షణ గొప్పతనాన్ని చాటుతూ, సామాజిక స్పృహతో హైదరాబాద్ విద్యార్థిని స్ఫూర్తి థియా వేదుల ‘Tomorrow Will Not Take Care of Itself’ అనే సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. చిన్న వయస్సులోనే మంచి సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ తీసిన స్ఫూర్తి పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే కలిగే దుష్పరిమాణాలను షార్ట్ ఫిల్మ్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు.