ఆలపాటిని ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం

– ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు

నరసరావుపేట, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్‌ సూచనల మేరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో అలపాటి రాజాను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు. పట్టణంలోని జమిందార్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల 2025 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఎమ్మెల్యే అధ్యక్షతన వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్ళుగా రాష్ట్ర ప్రజలతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. ప్రజలు ఇచ్చిన అఖండ మెజార్టీని నిలబెట్టుకోవాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలపాటి రాజేంద్రప్రసాద్ ని గెలిపించుకోవాలన్నారు. కలలో కూడా గత ప్రభుత్వం అధికారంలోకి రాకూడదన్నారు.

కూటమి అభ్యర్థి పేదవారికి అండగా నిలిచేవారన్నారు. మహిళలు, యువత ప్రభుత్వానికి అండగా ఉన్నారని,వారి అభిమానం చిరస్థాయిగా హృదయాలలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఎన్నికలలో పనిచేయాలని, కూటమికి మంచి మెజార్టీని ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, పట్టభద్రులు పాల్గొన్నారు.