సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి ప్లాన్‌!

– మజ్జి శ్రీనివాసరావు విమర్శ

విజయనగరం, మహానాడు: సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అనేక విపత్కర పరిస్థితుల్లో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు అండగా నిలబడ్డాయి. నగరపాలక సంస్థ కమీషనర్ నల్లనయ్య సచివాలయ సిబ్బందిపై దుర్భాషలు ఆడుతున్నారని జెడ్పీ చైర్‌పర్సన్‌, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) అన్నారు. ఈ మేరకు ఆయన జెడ్పీ చాంబర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులు అనారోగ్యంతో ఉన్నా వదలడం లేదు.

మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే… ఇటీవల జరిగిన ఉద్యోగుల బదిలీలు ఇష్టారాజ్యంగా చేశారు. బదిలీల పేరుతో ఉద్యోగులను వేధించారు. ఉద్యోగులను అన్యాయంగా జిల్లాలు దాటి బదిలీ చేశారు. సచివాలయ సిబ్బందికి అన్యాయం జరిగిందంటే పట్టించుకునే నాథుడు లేడు. ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురైతే వారికి వైసీపీ అండగా ఉంటుంది.